NBK 112 : బాల‌య్య కొత్త సినిమా ప్రారంభం.. 150 కోట్ల బ‌డ్జెట్‌తో..

నంద‌మూరి బాల‌కృష్ణ‌, కొర‌టాల శివ కాంబినేష‌న్ తెర‌కెక్క‌నున్న‌ సినిమా (NBK 112) పూజా కార్య‌క్ర‌మాల‌తో నేడు ప్రారంభ‌మైంది.

Nandamuri Balakrishna NBK 112 movie started with pooja ceremony

NBK 112 : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెరకెక్క‌నుంది. బాల‌య్య కెరీర్‌లో 112 మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా అమ‌రావ‌తిలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ చిత్రం (NBK112) పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించ‌గా బాల‌య్య అదిరిపోయే డైలాగ్‌ను చెప్పారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రావణ్ పలువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని 150 నుంచి 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా ఎంట‌ర్ టైన‌ర్‌గా నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆగ‌స్టులో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది, 2027 వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ఆలోచ‌న ఉంద‌న్నారు.

Patas faima : ప‌టాస్ ఫైమా హ‌ల్దీ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎప్పుడు సినిమా ఓపెనింగ్ కు నేను వెళ్ళలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముద్దుల మామయ్య బాలయ్యకు ధన్యవాదాలు. సినీ పరిశ్రమను అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో సినిమాతో పాటు, థియేటర్ ఎకనామిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ఏఐ టెక్నాలజీ తో సినిమా పరిశ్రమను మరింత ఉన్నతకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు ఈ పవిత్ర భూమి నుంచే ప్రారంభం కావాలని కోరుతున్నా అని అన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఎన్‌బికే 112 చిత్రానికి మంత్రి లోకేష్, నేను క్లాప్ కొట్టాం. ఈ సినిమాను అమరావతిలో చిత్రించాలి అని నిర్ణయించడం సంతోషించదగ్గ పరిణామం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు త్వరలో సినీ పరిశ్రమ కు చెందిన స్టూడియో కూడా రావాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తాం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

OG 2 : ఓజీ-2లో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్..!?

రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యాన‌ర్లపై సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని లు నిర్మిస్తున్నారు. బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లకు, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తోడు కానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.