Nandamuri Balakrishna send gifts for Ram Charan and Upasana mega twins.
Balakrishna: మెగా ఇంట సంబరాలు నెలకొన్న విషయం తెలిసిందే. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనించిన విషయం తెలిసిందే. అందులో ఒకరు పాప, ఒకరు బాబు అవడం విశేషం. ఈ న్యూస్ కేవలం మెగా కుటుంబంలోనే కాదు, మెగా ఫ్యాన్స్ లో కూడా ఆనందాన్ని నింపింది. దీంతో, మెగా ఫ్యాన్స్ అంతా టపాసులు కలుస్తూ, కేకులు కట్ చేస్తూ నానా హంగామా చేశారు.
Sunny Leone: ఆ బాధ వర్ణించలేను.. సన్నీ లియోన్ ఎమోషనల్ కామెంట్స్
అయితే, ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టిన కవల పిల్లలకు కానుకలు పంపిచాడట బాలయ్య. వాటిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, తిరుమల ప్రసాదం, పసిపిల్లల కోసం ప్రత్యేకమైన బొమ్మలు ఉండటం విశేషం. ఆ బహుమతి చూసి మెగా కుంటుంబం ముఖ్యంగా రామ్ చరణ్- ఉపాసన చాలా ఆనందం వ్యక్తం చేశారట.
ఇక ఈ న్యూస్ తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాలకృష్ణపై ప్రశంసలు కుపిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క బాలకృష్ణ మంచి మనసు గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సిఎంమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.