HanuMan : బాలయ్యకి ‘హనుమాన్’ స్పెషల్ ప్రీమియర్.. సెకండ్ పార్ట్ కోసం..
'హనుమాన్' స్పెషల్ ప్రీమియర్ వేయించుకొని మరి చూసిన బాలయ్య. సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం..
![HanuMan : బాలయ్యకి ‘హనుమాన్’ స్పెషల్ ప్రీమియర్.. సెకండ్ పార్ట్ కోసం.. HanuMan : బాలయ్యకి ‘హనుమాన్’ స్పెషల్ ప్రీమియర్.. సెకండ్ పార్ట్ కోసం..](https://10tv.in/wp-content/uploads/2024/01/Nandamuri-Balakrishna-watch-Hanuman-movie-with-director-prasanth-varma.jpg)
Nandamuri Balakrishna watch Hanuman movie with director prasanth varma
HanuMan : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. రామభక్త హనుమాన్ ని వరల్డ్ మూవీ లవర్స్ కి ఓ సూపర్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు.
టాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు ఇతర సినీ పరిశ్రమకి చెందిన వారు కూడా హనుమాన్ టీంని అభినందిస్తూ పోస్టులు వేస్తున్నారు. ఇక తాజాగా నటసింహ బాలకృష్ణ కూడా హనుమాన్ టీంని ప్రశంసించారు. హనుమాన్ స్పెషల్ ప్రీమియర్ షో వేయించుకొని మరి బాలకృష్ణ.. ఈ సినిమాని వీక్షించారు. మూవీ చూసిన అనంతరం తన రివ్యూని తెలియజేశారు. సినిమా కన్నుల పండుగలా ఉందని కితాబు ఇచ్చారు.
Also read : Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..
మూవీలోని ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ప్రాణం పెట్టి చేసినట్లు స్క్రీన్ పై కనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే హనుమాన్ 2 కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ చూసిన తరువాత నుంచి బాలయ్య అభిమానులంతా.. ఆ వార్త నిజమయితే బాగుండు అనే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
Just #HANUMAN things..!
‘Natasimham’ #NandamuriBalakrishna watched HanuMan movie yesterday and got mesmerised with the Epic Superheroic saga on the big screen 🤩
He even appraised the valiant efforts of @PrasanthVarma, @Niran_Reddy, @tejasajja123 & the whole team in creating… pic.twitter.com/4fMrXhtZfB
— Mythri Movie Makers (@MythriOfficial) January 17, 2024
ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాని ప్రత్యేకంగా బాలయ్య వీక్షించడంతో.. ఆ వార్త నిజమే అనుకుంటా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. కాగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ బాలయ్యకి ఓ కథ వినిపించారు. బాలకృష్ణ నుంచి కూడా గ్రీన్ సింగల్ రావాల్సి ఉందట. అయితే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందో లేదా స్టాండ్ ఎలోన్ మూవీనా అనేది తెలియాల్సి ఉంది.