Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..

ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీలో మహేష్ కూతురు సితార పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..

Sitara Ghattamaneni Special Attraction in Guntur Kaaram Success Party with Sreeleela Photos goes Viral

Updated On : January 17, 2024 / 11:08 AM IST

Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా మంచి విజయం సాధించినందుకు మహేష్ స్పెషల్ గా సక్సెస్ పార్టీ ఇచ్చారు. మహేష్ ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ పార్టీకి మహేష్ ఫ్యామిలీతో పాటు, దిల్ రాజు ఫ్యామిలీ, నాగ వంశీ ఫ్యామిలీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ.. పలువురు మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీలో మహేష్ కూతురు సితార పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీలీలతో కలిసి సితార ఫుల్ ఎంటర్టైన్ అయింది. పార్టీలో వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేసారని టాక్. ఇక శ్రీలీల(Sreeleela), సితార కలిసి కొన్ని ఫొటోలు దిగారు. వాటిని సితార, శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

ఈ ఫొటోలతో శ్రీలీల, సితార పాప మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని అభిమానులు అంటున్నారు. ఇక సితార రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీలీలతో దిగిన స్పెషల్ ఫొటోలతో గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి మరోసారి వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by sitara ? (@sitaraghattamaneni)