NKR21 Pooja Ceremony : నందమూరి కళ్యాణ్ రామ్ సర్‌ప్రైజ్.. NKR21 లో విజయశాంతి.. కొత్త సినిమా ఓపెనింగ్..

కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్(Devil) సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 21వ సినిమాని కూడా ఇటీవల అనౌన్స్ చేశారు.

Nandamuri Kalyan Ram NKR 21 Pooja Ceremony Happened

NKR21 Pooja Ceremony : నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ఇటీవల బింబిసార(Bimbisara) సినిమాతో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మంచి విజయం సాధించాడు. త్వరలో డెవిల్(Devil) సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 21వ సినిమాని కూడా ఇటీవల అనౌన్స్ చేశారు. ‘అశోక క్రియేషన్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నారా రోహిత్, నందమూరి తారకరత్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రాబోతుంది.

Also Read : Kangana Ranaut : అత్త అయిన కంగనా రనౌత్.. మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోతూ..

నేడు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించగా త్వరలోనే అధికారికంగా షూట్ మొదలవ్వనున్నట్టు తెలిపారు చిత్రయూనిట్. ఈ సినిమాలో కళ్యాణ్ పూర్తి యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు