Kalyan Ram Son: కళ్యాణ్ రామ్ కొడుకును చూశారా.. కిక్ బాక్సింగ్ కుమ్మేస్తున్నాడు.. క్రేజీ వీడియో వైరల్ అవుతోంది
కిక్ బాక్సింగ్ తో కుమ్మేస్తున్న కళ్యాణ్ రామ్ కుమారుడు(Kalyan Ram Son) శౌర్య రామ్.
- V Santhosh Kumar
- Published on- May 29, 2026 / 11:56 AM IST
nandamuri kalyan ram son sourya ram kickboxing practice videos viral
- నందమూరి వంశం నుండి మరో వారసుడు
- కిక్ బాక్సింగ్‌తో శౌర్య రామ్ రచ్చ
- కళ్యాణ్ రామ్ కొడుకు వీడియో వైరల్
Kalyan Ram Son: నందమూరి వంశం నుండి వెండితెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు(Kalyan Ram Son) శౌర్య రామ్ సినీ అరంగేట్రం (డెబ్యూ) కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలం చేకూరుస్తూ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Peddi: ‘పెద్ది’ టీమ్ సీరియస్ యాక్షన్.. నెగెటివ్ స్ప్రెడ్ చేసినా, పైరసీ చేసినా జైలుకే
ఈ వైరల్ వీడియోలో శౌర్య రామ్ కిక్ బాక్సింగ్‌లో దుమ్ములేపుతూ కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో మాస్టర్ ను సైతం ఆశ్చర్యపరిచాడు. పంచ్ బ్యాగ్‌పై శౌర్య చూపిస్తున్న వేగం, పవర్ చూస్తుంటే తాను పక్కా కమర్షియల్ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడే సిద్ధమవుతున్నట్లు హింట్ ఇస్తున్నాడు. ఈ డెడికేషన్ చూసిన నందమూరి ఫ్యాన్స్.. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన ఒక క్రేజీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు తండ్రి మల్టీస్టారర్‌తో బిజీగా ఉండగా, మరోవైపు కొడుకు క్రేజీ వీడియోలు వైరల్ అవడం విశేషంగా మారింది.
Kalyan Ram son @Nandamurikalyan #SouryaRamNandamuri@tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/nRd3O75dRN
— Indian Clicks (@IndianClicks) May 29, 2026
