The Paradise First Review : ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా టాక్ ఏంటి.. ఇంటర్వెల్ మాత్రం..
ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం ది ప్యారడైజ్ సినిమాలో.. (The Paradise First Review)
The Paradise First Review
The Paradise First Review : నాని, కయదు లోహర్ జంటగా తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24 రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ట్రైలర్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే సెన్సార్ పూర్తవడం, ఇండస్ట్రీలో పలువురు ఈ సినిమా చూడటంతో ది ప్యారడైజ్ టాక్ బయటకు వచ్చింది.
ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం ది ప్యారడైజ్ సినిమాలో.. సవారీలు అనే ఓ జాతి ఉంటుంది. వాళ్ళు అసలు జనాభా లెక్కల్లో ఉండరు, వాళ్లకు గుర్తింపు ఉండదు. దాంతో కొంతమంది వీళ్ళను నేరాలు చేయడానికి ఉపయోగిస్తారు. కొంతమంది సొంతంగా నేరాలు చేస్తారు. వీళ్ళను శికంజ మాలిక్(మోహన్ బాబు), అతని కొడుకు(రాఘవ్ జుయల్) దారుణంగా చూస్తారు. క్రూరంగా హింసిస్తూ ఉంటారు. ఆ జాతికి సంబంధించిన వాడే జడల్(నాని). అయితే జడల్ ఇవేమి పట్టించుకోకుండా తన లైఫ్ తనకు చూసుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ బిర్యానీ(సంపూర్ణేష్ అబూ) , తన తల్లి సంఘటనలతో జడల్ మారి సవారీ జాతికి నాయకుడిగా నిలబడి పోరాటం చేయడం మొదలుపెడతాడు. శికంజి మాలిక్, అతని మనుషులకు ఎదురు తిరిగి సవారీలు ఎలాంటి గుర్తింపు తెచ్చాడు జడల్ అనేదే కథ అని తెలుస్తుంది.
Also Read : CM Revanth Reddy : నాని రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన సీఎం.. తెలంగాణ దర్శకుడి సినిమా అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్..
ఈ సినిమాలో నాలుగు మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయట. ఆ నాలుగు అదిరిపోయే హై రేంజ్ లో ఉండనున్నాయట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు చాలా ప్లస్ అవ్వనుంది. క్లైమాక్స్ అయ్యాక బయటకు వచ్చేటప్పుడు కూడా యాక్షన్ కాకుండా ఎమోషన్ తో బయటకు వస్తారట. ఈ సినిమాలో వైలెన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయట. సలసలకాగే ఆయిల్ లో పడి కాలడం, మహిళలతో బలవంతంగా బట్టలు విప్పించడం, గర్భిణీ స్త్రీకి బలవంతంగా విద్యుత్ షాక్ ఇవ్వడం, మహిళలను వేలంలో అమ్మే లాంటి బ్బందికర సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇందులో తల్లి సెంటిమెంట్ పెట్టినా ఫ్యామిలీ, చిన్న పిల్లలతో కలిసి చూసే సినిమా అయితే కాదు అని టాక్.
నాని రెండు జడలతో ఒక కొత్త లుక్ లో చాలా బాగా కష్టపడ్డాడు. సంపూర్ణేష్ బాబు కూడా చాలా కొత్త లుక్ లో యాక్షన్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించాడు. మోహన్ బాబు చాలా బ్రూతల్ గా, దారుణమైన విలన్ గా కనిపించబోతున్నాడట చాలా గ్యాప్ తర్వాత. సోనాలి కులకర్ణి కూడా నాని తల్లి పాత్రలో మెప్పించిందట.
సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయట. అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని ఇప్పటికే మూవీ యూనిట్ అంతా చెప్తున్నారు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఇక పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. దాదాపు 2 గంటల 54 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉంది. మరి నాని పూర్తిగా కొత్త లుక్ లో ఫుల్ యాక్షన్ తో చేసిన ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
