Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్.. కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించే పిచ్చోడు..

ఆల్రెడీ సరిపోదా శనివారం సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్.. కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించే పిచ్చోడు..

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram Glimpse : ఇటీవల దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు. నానితో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రియక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు.

ఆల్రెడీ సరిపోదా శనివారం సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా నేడు నాని పుట్టిన రోజు కావడంతో తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో SJ సూర్య వాయిస్ తో.. కోపాలు రకరకాలు, ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. పేరు.. సూర్య, రోజు.. శనివారం అని పవర్ ఫుల్ గా చెప్పించారు. గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

Also Read : Ashish & Advitha Wedding Reception : హీరో ఆశిష్ – అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు.. సెలబ్రిటీల సందడి..

సరిపోదా శనివారం మాస్ కమర్షియల్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 29న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి నాని మరోసారి హ్యాట్రిక్ కొడతాడని భావిస్తున్నారు. ఆ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.