Nani32 : నాని, సుజిత్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది.. రజినీకాంత్ ‘బాషా’ రేంజ్‌లో..

నాని, సుజిత్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది. రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తుంటే..

Nani32 : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 24) కావడంతో.. ఆయన కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ఈరోజు ఉదయం ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వచ్చింది. తాజాగా నాని 32వ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్న సుజిత్ తో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

డివివి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఉండబోతుందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ థీమ్ ని తెలియజేస్తూ చిత్ర యూనిట్.. సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మాఫియాకి చెందిన ఒక వ్యక్తి అన్ని మర్చిపోయి.. ఫుడ్ ట్రక్ నడుపుకుంటూ సాధారణ మనిషిగా బ్రతుకుతూ ఉంటాడు. అలా బ్రతుకుతున్న ఆ వ్యక్తి జీవితం తలకిందులు అవుతే.. అప్పుడు కథ ఏంటి అనే నేపథ్యంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Also read : Nani : ఆ దర్శకుడితో నాని సినిమా ఫిక్స్.. బర్త్ డే ఫోటోతో కన్ఫార్మ్ చేసేశారు..

ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే.. రజినీకాంత్ బాషా మూవీ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో కూడా రజినీకాంత్ తన మాఫియా లైఫ్ ని వదిలేసి ఆటో డ్రైవర్ గా సాధారణ వ్యక్తిగా బ్రతుకుతుంటాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు. మిగితా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఆ అనౌన్స్ మెంట్ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఇక ఈ బర్త్ డే సందర్భంగా దిల్ రాజు నిర్మాణంలో నాని చేయబోయే సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని.. రీసెంట్ గా ‘బలగం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘వేణు’ డైరెక్ట్ చేయబోతున్నారు. నేడు నిర్మాత శిరీష్, దర్శకుడు వేణు నాని కలుసుకొని బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నా ఫోటో షేర్ చేసి మూవీ ని కన్ఫార్మ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు