The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?
నాని కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చిన సినిమా ఇది. (The Paradise)
- Saketh U
- Published on- October 18, 2026 / 12:17 PM IST
The Paradise
The Paradise : నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ముందు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ తో వచ్చిన భారీ హైప్ తో రిలీజయింది. ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా తర్వాత మిక్స్డ్ టాక్ తో నడిచింది. కమర్షియల్ గా సినిమా కొంత నష్టాన్నే చూసిందని సమాచారం. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ నాని కెరీర్ లో డిఫరెంట్ సినిమాగా నిలిచింది ది ప్యారడైజ్.
నాని కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చిన సినిమా ఇది. నాని జడల్ గా సరికొత్త రోల్ లో చేసిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24 థియేటర్స్ లోకి రాగా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ది ప్యారడైజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
