nani the paradise movie postponed to august
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్(The Paradise)’. దసరా మూవీ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. రా అండ్ రస్టిక్, బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబో.. మిస్సైన డైరెక్టర్ తో నాని సినిమా
అయితే, తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ముందుగా ‘ది ప్యారడైజ్’ సినిమాను మార్చ్ 26న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. అది కూడా ఏకంగా నాలుగు నెలలు. అధికారిక ప్రకటన ప్రకారం ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీంతో, నాని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
Mere Pyaare Paradise Waasiyon – #JadalZamanaFromAug21 🔥🌋🥁#TheParadise GRAND RELEASE WORLDWIDE ON AUGUST 21st, 2026 ❤🔥
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An… pic.twitter.com/5TkG6qtnOf— THE PARADISE (@TheParadiseOffl) February 12, 2026