Nara Lokesh: మెగా హీరో సినిమాపై నారా లోకేష్ ప్రశంసలు.. తప్పకుండా చూస్తానంటూ ట్వీట్!
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "రిపబ్లిక్".
- vamsi
- Updated on- October 3, 2021 / 02:36 PM IST
Nara Lokesh
Nara Lokesh: సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “రిపబ్లిక్”. ఈ సినిమా శుక్రవారం విడుదలవ్వగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. నిజ జీవితంలో ఉండే రాజకీయాలకు దగ్గరగా తెరకెక్కించారంటూ రివ్యూలు వస్తుండగా.. సినీ, రాజకీయ నాయకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సినిమా గురించి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లోకేష్ ఎప్పుడూ రాజకీయాలపై ట్వీట్లు చేస్తుంటారు. సినిమా గురించి లోకేష్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
రిపబ్లిక్ సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోందని, రివ్యూలు చాలా బాగున్నాయని, సాయి ధరమ్‌తేజ్ దేవకట్టా కాంబినేషన్లో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాను చూసేందుకు ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు నారా లోకేష్.
సాయి ధరమ్‌తేజ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. నా లోకేష్ చేసిన ట్వీట్‌తో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చినట్లైంది. ఈ సినిమాను నారా లోకేష్ త్వరలో ప్రత్యేకంగా చూసే అవకాశం ఉంది.
