Aadarsha Kutumbam : ఆద‌ర్శ‌కుటుంబం నుంచి ఫ‌స్ట్ సింగిల్.. ‘నారాయణమ్మ’ వ‌చ్చేసింది..

విక్టరీ వెంకటేష్ న‌టిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) నుంచి తొలి పాట వ‌చ్చేసింది.

Aadarsha Kutumbam, Narayanamma song

Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ న‌టిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ‌, రావు ర‌మేష్‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబ‌ర్ 9న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట నారాయ‌ణ‌మ్మ పాట‌ను విడుద‌ల‌చేశారు. రామ జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా.. ప్ర‌భ, రామ్‌లు పాడారు.

Akhil Akkineni : బిగ్ ప్రాజెక్టుపై అఖిల్ డైల‌మా?