Danny : ‘నాటకం’ కాంబో మళ్ళీ ఇన్నాళ్లకు.. డానీ రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మీట్..
ఈ కాంబో ఇన్నేళ్ల తర్వాత కలిసి మళ్ళీ రాబోతున్నారు. (Danny)
- Saketh U
- Published on- November 2, 2026 / 06:43 PM IST
Danny
Danny : డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ – నిర్మాత రిజ్వాన్ – హీరో ఆశిష్ గాంధీ కాంబోలో 2018 లో వచ్చిన నాటకం సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి క్లైమాక్స్ ట్విస్ట్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కాంబో ఇన్నేళ్ల తర్వాత కలిసి మళ్ళీ రాబోతున్నారు.
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా జంటగా సోనాల్ సింగ్, అజర్ ఖాన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డానీ. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల పై రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డానీ సినిమా నవంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నేడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also See : Ritika Nayak : హ్యాట్రిక్ హీరోయిన్ రితిక నాయక్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఈ ప్రెస్ మీట్ లో హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. కళ్యాణ్, నేను, రిజ్వాన్ కలిసి ‘నాటకం’ చేశాము. మళ్లీ ఇప్పుడు డానీతో కలిశాం. ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. మా సినిమా నవంబర్ 20న రాబోతోంది అని అన్నారు. డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ.. నిర్మాత రిజ్వాన్, ఆశిష్, నేను కలిసి ‘నాటకం’ చేశాం. ఆశిష్ కెమెరా ముందు ఉంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రిజ్వాన్ తో నాకు ఎంతో కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి ఓ డిఫరెంట్ లవ్, రస్టిక్ డ్రామాకి రిజ్వాన్ లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేస్తారని అనిపించింది. చివరి నిమిషంలో సేజల్ని తీసుకున్నాం. రాకేందు మౌళి ఉంటే నాకు భరోసాగా అనిపిస్తుంది అని తెలిపారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. వీళ్ళతో కలిసి నాటకం సినిమా నిర్మించాను. ఇప్పుడు డానీ నిర్మించాను. గోవాలోనే ఎక్కువ భాగం షూట్ చేసాం. అని తెలిపారు. రచయిత రాకేందు మౌళి మాట్లాడుతూ.. డానీ టైటిల్ సాంగ్ బాగుంటుంది. మొదటి సారి నేను ఆంగ్లంలో కూడా లిరిక్స్ రాశాను. ప్రేమలోని దశల్ని పట్టి ఇందులో డిఫరెంట్ సాంగ్స్ రాసే అవకాశం వచ్చింది అని తెలిపారు.
