Honey OTT: ఓటీటీలోకి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నవీన్ చంద్ర లేటెస్ట్ థ్రిల్లర్ 'హాని(Honey OTT)' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
- V Santhosh Kumar
- Published On : February 24, 2026 / 09:13 AM IST
Naveen Chandra Haani Movie OTT Streaming Update
Honey OTT: టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హనీ(Honey OTT)’. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో దివ్య పిళ్ళై హీరోయిన్ గా నటించింది. సైన్స్ ఇంతలా డెవలప్ అవుతున్న ప్రెజెంట్ జనరేషన్ లో కూడా చాలా మంది బ్లాక్ మ్యాజిక్(చేతబడి) లాటి వాటిని నమ్ముతూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమానే ‘హనీ’.
Sri Gouri Priya: తమిళ సినిమాకి తొలి ఫిలిం ఫేర్.. శ్రీ గౌరీ ప్రియ స్పెషల్ ఫొటోస్ వైరల్
ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం అనుకున్నంత పాజిటీవ్ టాక్ రాలేదు. దీంతో, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. హనీ మూవీ ఓటీటీ హక్కులను ప్రాముఖ సంస్థ సన్ నెక్స్ట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఫిబ్రవరి 27 శుక్రవారం నుంచు స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఓటీటీలో థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. కాబట్టి, ఓటీటీలో హనీ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
