Naveen Chandra interesting comments about Honey movie.
Naveen Chandra: టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో నవీన్ చంద్ర ఒకరు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మధ్యమధ్యలో అరవింద సమేత, గేమ్ ఛేంజర్, మాస్ జాతర లాంటి సినిమాలలో విలన్ గా చేస్తూ వస్తున్నాడు. అయినా, కూడా నవీన్ చంద్ర(Naveen Chandra) సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నాడు
ఇదిలా ఉంటే, నవీన్ చంద్ర హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హానీ. సైకలాజికల్ అండ్ హారర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాలో దివ్య పిళ్ళై, దివి, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు చేస్తుండగా పలాస ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. దీంతో, వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Jyoti Poorvaj: నాజూకు నడుమందాలు.. ఎగసిపడే ఎద అందాలు.. జ్యోతి పూర్వాజ్ గ్లామర్ పీక్స్.. ఫొటోలు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “హనీ సినిమా కేవలం ఒక హారర్ సినిమా మాత్రమే కాదు. ఆడియన్స్ కి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న చీకటి కోణాన్ని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాం. ఈ కథ విన్నప్పటి నుంచే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఏ మనిషైనా మానసికంగా బలహీనమైనప్పుడు సమాజంలోని కొన్ని దుష్టశక్తులకు ఎలా బలవుతాము అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
ఇక నా సినిమాల గురించి ఒకటే చెప్తాను. నా సినిమాలకు మొదట పది మంది థియేటర్స్ కి వచ్చారు. ఆ తరువాత వంద మంది అయ్యారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది రండి. ఒకసారి థియేటర్స్ కి వచ్చి నా సినిమాలకు కూడా ట్రై చేయండి” అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. దీంతో నవీన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.