×
Ad

Anaganaga Oka Raju OTT: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju OTT) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.

Naveen Polishetty Anaganaga Oka Raju movie OTT streaming update.

  • నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ హిట్ మూవీ అనగనగా ఒక రాజు
  • ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్దమైన అనగనగా ఒకరాజు
  • నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి రెండోవారం నుంచి స్ట్రీమింగ్

Anaganaga Oka Raju OTT: టాలీవుడ్ టాలెంటెడ్ నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించింది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో, కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ సినిమా.

Yellamma: ‘ఎల్లమ్మ’ సినిమాలో విలన్ గా ఒకప్పటి హీరో.. దేవికి పోటీగా భలే సెట్ చేశారు!

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju OTT) సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నటు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 13 నుంచి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న అనగనగా ఒక రాజు సినిమాకు ఓటీటీలో అదే లెవల్లో రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.