NBK 108 : 108 హోర్డింగ్స్ తో బాలయ్య 108 సినిమా టైటిల్ అనౌన్స్.. బాలయ్య బర్త్ డే ముందే సూపర్ ప్లాన్..
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు టైటిల్ ని ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే అభిమానులకి జోష్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.
- Saketh U
- Published on- June 7, 2023 / 12:45 PM IST
NBK 108 Movie title announcement on June 8th with 108 hoardings in Telugu states
Balakrishna : ప్రస్తుతం బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్100 కోట్ల సూపర్ హిట్ సినిమాలు సాధించారు. ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేసే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ సినిమాలు చేసే బాలయ్య సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 108 సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు టైటిల్ ని ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే అభిమానులకి జోష్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. జూన్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఊర్లల్లో 108 భారీ హోర్డింగ్స్ పై టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. 108వ సినిమాకి 108 భారీ హోర్డింగ్స్ ప్లాన్ చేశారు చిత్రయూనిట్. టాలీవుడ్ లో ఇలా అచేయడం ఇదే మొదటిసారి అంటూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. #NBKLikeNeverBefore అంటూ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో బాలయ్య అభిమానులు NBK 108వ సినిమా టైటిల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల భగవత్ కేసరి అనే టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి ఇదే టైటిల్ ని ప్రకటిస్తారా లేక ఇంకేదైనా కొత్త టైటిల్ ప్రకటిస్తారా చూడాలి.
