Negative comments on Nani Aaya Sher song
Aaya sher; నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. రెండు జడలతో జెడలు అనే పాత్రలో నాని నెవర్ బిఫోర్ అవతారంలో కనిపిస్తున్నాడు. దీంతో, ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక సినిమాలో కంటెంట్ కూడా రా అండ్ రస్టిక్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్(Aaya sher) అంటూ సాగే నాని పరిచయ గీతాన్ని విడుదల చేశారు మేకర్స్. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఉంది. ఇక నాని మాస్ ప్రెజెన్స్ అయితే హైలెట్ అనే చెప్పాలి. ఇక ఆయన వేసిన హుక్ స్టెప్స్ గానీ, మాస్ డాన్స్ గానీ అరాచకం అనే లెవల్లో ఉన్నాయి. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే చాట్ బస్టర్ లిస్టులోకి చేరింది ఆ పాట. ఇక కాసర్ల శ్యామ్ అందించిన మాస్ లిరిక్స్ సింగ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.
Youtuber Komali: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
మొత్తంగా ఆయా షేర్ అనే సింగ్ ఆడియన్స్ ను మెప్పించడమే కాదు.. ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ, నాని ఆయా షేర్ సింగ్ పై కొంతమంది పనిగట్టుకొని నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట తెలుగు పాటలా లేదని, మలయాళ సాంగ్ లా ఉందని, లిరిక్స్ అసలు అర్థం కావడం లేదని ఏదోలా నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐయితే, ఈ కామెంట్స్ ని నాని ఫ్యాన్స్ అంతే బలంగా తిప్పి కొడుతున్నారు. ది ప్యారడైజ్ సినిమా అనేది పీరియాడికల్ మూవీ ఆ సమయంలో భాష ఎలా ఉండేది అనేది తీసుకొని కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సరిగ్గా వింటే అది క్లియర్ గా అర్థమవుతుంది. అది వదిలేసి కావాలని సాంగ్ పై నెగిటీవ్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే నాని ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతున్నాడు. ఆయన్ని కిందకు దించాలని ఉద్దేశంతో కూడా కావాలని నెగిటీవ్ క్రియేట్ చేస్తున్నారు. అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మరి ఈ సాంగ్ పై నెగిటీవ్ కామెంట్స్ ఇకనైనా ఆగుతాయా అనేది చూడాలి.