Nenevaru Movie: రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘నేనెవరు’!
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు నిర్మాతలుగా, నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్ కుమావత్ - కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.
- Anil Aaleti
- Updated on- September 19, 2022 / 03:54 PM IST
Nenevaro Movie Audio Released
Nenevaru Movie: కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు నిర్మాతలుగా, నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్ కుమావత్ – కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో అండ్ ప్రోమోను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో యువ హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్‌లు విడుదల చేశారు. సీనియర్ నటులు గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ప్రముఖ రచయిత నివాస్, నాగబాల సురేష్ కుమార్, రాధ గోపి, సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్, ఆదిత్య ప్రతినిధులు నిరంజన్, మాధవ్ తదితరులు హాజరైన ఈ వేడుకలో ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
దర్శకుడిగా నిర్ణయ్‌కి, సంగీత దర్శకుడు సారథికి, హీరో బాలకృష్ణకి, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రం ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఎడిటర్‌గా కోలా భాస్కర్ చివరి చిత్రం ‘నేనెవరు’ కావడం విశేషం. ఈ చిత్రానికి సామల భాస్కర్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా, ఎడిటింగ్ కోలా భాస్కర్, ఫైట్స్ – రియల్ సతీష్, కొరియోగ్రఫీ – చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ – ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్ – వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్ – ప్రసాద్ లాబ్స్, పాటలు – కృష్ణకాంత్, సంగీతం – ఆర్.జి.సారథి, సహనిర్మాతలు – పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు – భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు, దర్శకత్వం – నిర్ణయ్ పల్నాటి వహిస్తున్నారు.
