Sunil Thapa : నేపాలీ స్టార్ యాక్టర్ కన్నుమూత.. ఆయన నటించిన ఒకేఒక తెలుగు సినిమా ఏంటో తెలుసా..?
నేపాల్ స్టార్ యాక్టర్ సునీల్ తప నేడు ఉదయం మరణించారు. (Sunil Thapa)
- Saketh U
- Published On : February 7, 2026 / 02:22 PM IST
Sunil Thapa
Sunil Thapa : నేపాల్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నేపాల్ స్టార్ యాక్టర్ సునీల్ తప నేడు ఉదయం మరణించారు. 68 ఏళ్ళ వయసులో హార్ట్ అటాక్ రాగా ఖాట్మండులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో నేపాల్ సినీ ప్రముఖులు, అక్కడి ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.(Sunil Thapa)
1981 నుంచి సునీల్ తప సినిమాలు చేస్తున్నారు. నేపాల్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకున్న సునీల్ తప ఇండియాలో బాలీవుడ్, భోజ్ పురి సినిమాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ్ లో కూడా ఒక్కో సినిమాలో నటించారు ఈయన. ఆయనకు నేపాల్ లో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా ఉంది.
Also Read : Prabhas : జపాన్ మ్యాగజైన్ కోసం ప్రభాస్ స్పెషల్ ఫోటోషూట్.. రెబల్ స్టార్ క్యూట్ ఫొటోలు..
బాలీవుడ్ లో ప్రియాంకచోప్రా మేరీకోమ్ బయోపిక్ సినిమాలో కోచ్ పాత్రలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సునీల్ తప. తెలుగులో ఇటీవల తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్ సినిమాలో నటించాడు. మిరాయ్ సినిమాలో నేపాల్ దేశంలో ఉన్న సన్నివేశాల్లో ఓ కీలక పాత్రలో సునీల్ తప కనిపిస్తారు. తమిళ్ లో విక్రమ్ 10 ఎండ్రతుకుల్లా సినిమాలో నటించారు. సునీల్ తప మరణం నేపాల్ సినీ పరిశ్రమకు తీరని లోటు.
