Ted Sarandos : నిన్న మెగా ఫ్యామిలీ, ఇవాళ నందమూరి ఫ్యామిలీతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. తెలుగులో ఏం ప్లాన్ చేస్తున్నారు?

వరల్డ్ లోనే టాప్ ఓటీటీ అధినేత ఇండియాకు రాగా మన టాలీవుడ్ కి వచ్చి మెగా ఫ్యామిలీతో మీటింగ్ పెట్టారని తెలియడంతో నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Ted Sarandos : నిన్న మెగా ఫ్యామిలీ, ఇవాళ నందమూరి ఫ్యామిలీతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. తెలుగులో ఏం ప్లాన్ చేస్తున్నారు?

Netflix CEO Ted Sarandos meets Mega Family and Nandamuri Family Photos Goes Viral

Ted Sarandos : రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) లు ఇద్దరూ కూడా RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ లో ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, చరణ్.. ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖుల్ని కలిశారు. తాజాగా నెట్ ఫ్లిక్స్(Netflix) CEO టెడ్ సరండోస్ ఇండియాకు రాగా నిన్న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసి, చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో కలిసి మాట్లాడారు.

చిరు ఇంట్లో టెడ్ సరండోస్ లంచ్ చేయడం, మీటింగ్ పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. వరల్డ్ లోనే టాప్ ఓటీటీ అధినేత ఇండియాకు రాగా మన టాలీవుడ్ కి వచ్చి మెగా ఫ్యామిలీతో మీటింగ్ పెట్టారని తెలియడంతో నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు మధ్యాహ్నం టెడ్ సరండోస్, అతని టీం నందమూరి ఫ్యామిలీని కలిశాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివలు నేడు టెడ్ సరండోస్ కి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు.

ఎన్టీఆర్ స్వయంగా టెడ్ సరండోస్ ని మీట్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టెడ్ సరండోస్ కి లంచ్ ఏర్పాటు చేసి, వారితో టైం గడిపినందుకు సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. దీంతో నెట్ ఫ్లిక్స్ CEO టాలీవుడ్ మీటింగ్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సడెన్ గా ఇండియాకి వచ్చిన టెడ్ సరండోస్ టాలీవుడ్ కి వచ్చి మెగా, నందమూరి ఫ్యామిలీలను కలవడం, వారితో లంచ్ చేయడం, ఫోటోలు దిగడంతో నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ లో గట్టిగా ఏదైనా ప్లాన్ చేస్తుందా? లేదా మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళారా? ఎవ్వర్నీ కలవకుండా చరణ్, ఎన్టీఆర్ లనే కలవడం ఏంటి? హాలీవుడ్ కి ఏదైనా సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? అనే వార్తలు వస్తున్నాయి.

Netflix CEO Ted Sarandos meets Mega Family and Nandamuri Family Photos Goes Viral

ఇంకా ఎవర్నైనా కలుస్తారా? బాలీవుడ్ లో ఎవర్నైనా కలుస్తారా?.. లాంటి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో. ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ మెగా, నందమూరి ఫ్యామిలీలని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోలని మరింత షేర్ చేస్తున్నారు.

Netflix CEO Ted Sarandos meets Mega Family and Nandamuri Family Photos Goes Viral

Also Read : MP Ranjeet Ranjan : యానిమల్, పుష్ప సినిమాలపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ విమర్శలు.. ఇలాంటి సినిమాలు..

నెట్ ఫ్లిక్స్ గత కొన్నాళ్లుగా ఇండియాలోని లోకల్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టి లోకల్ భాషల్లో కూడా సిరీస్ లు, సినిమాలు ప్లాన్ చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ని ఇంకా విస్తరించాలనే నేపథ్యంలో, నెట్ ఫ్లిక్స్ మార్కెట్ పెంచాలని టెడ్ సరండోస్ ఇక్కడికి రావడం , వాళ్ళని కలవడం జరిగిందని పలువురు భావిస్తున్నారు.