MP Ranjeet Ranjan : యానిమల్, పుష్ప సినిమాలపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ విమర్శలు.. ఇలాంటి సినిమాలు..

తాజాగా యానిమల్ సినిమాతో పాటు పుష్ప, కబీర్ సింగ్ సినిమాలపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

MP Ranjeet Ranjan : యానిమల్, పుష్ప సినిమాలపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ విమర్శలు.. ఇలాంటి సినిమాలు..

MP Ranjeet Ranjan Sensational Comments on Animal Movie

MP Ranjeet Ranjan : సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో రణబీర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika Mandanna) జంటగా వచ్చిన యానిమల్(Animal) సినిమా ప్రస్తుతం భారీ విజయంతో దూసుకుపోతుంది. స్టార్ సెలబ్రిటీలు సైతం సినిమా అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఎక్కువగా ఉండటంతో కొంతమంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేస్తున్నారు.

అయితే సినిమాపై వచ్చే నెగిటివ్ రివ్యూలు, విమర్శలు పట్టించుకోనని డైరెక్టర్ సందీప్ ముందే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా యానిమల్ సినిమాతో పాటు పుష్ప, కబీర్ సింగ్ సినిమాలపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్న రంజీత్ రంజన్ తాజాగా రాజ్యసభలో యానిమల్, కబీర్ సింగ్, పుష్ప సినిమాలపై విమర్శలు చేసింది.

Also Read : Prabhas : ప్రభాస్ సినిమాలో సరికొత్త విలన్ గా సంజయ్ దత్.. సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న డైరెక్టర్ మారుతి..

ఎంపీ రంజిత్ రంజన్ మాట్లాడుతూ.. సినిమా అనేది సొసైటీకి అద్దం లాంటిది. మనం సినిమాలు చూసి పెరుగుతాం. ముఖ్యంగా యూత్ మీద సినిమాలు ప్రభావం చూపుతాయి. మా అమ్మాయి యానిమల్ సినిమాకు వెళ్లి మధ్యలోనే ఏడ్చుకుంటూ వచ్చింది. మొన్న కబీర్ సింగ్, పుష్ప, ఇప్పుడు యానిమల్.. ఇలాంటి సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. కబీర్ సింగ్ లో అమ్మాయిలని సరిగ్గా ట్రీట్ చేయడు, ఇలాంటి వాళ్ళని యూత్ రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమాల్లో పురుష అహంకారం, సమాజంపై విషపూరితమైన ఆలోచనలు చూపిస్తున్నారు. ఈ సినిమాల్లో వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంది. యానిమల్ సినిమాలో పవిత్రమైన సిక్కుల సాంగ్ ఒక మర్డర్స్ చేసే యాక్షన్ సీన్ లో వాడారు. సిక్కుల మనోభావాలు కూడా దెబ్బతీశారు అని అన్నారు.

దీంతో రంజీత్ రంజన్ చేసినా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అలాగే అసలు ఇలాంటి సినిమాలని సెన్సార్ బోర్డు ఎలా సెన్సార్ చేసిందని మండిపడ్డారు. మరి దీనిపై చిత్రయూనిట్ కానీ, డైరెక్టర్ సందీప్ వంగా కానీ స్పందిస్తారేమో చూడాలి.