Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఈజ్ బ్యాక్.. ప్రొఫెసర్ వేట మొదలు.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?
నెట్‌ఫ్లిక్స్, మనీ హెయిస్ట్(Money Heist) సిరీస్ కొత్త సీజన్ పై అధికారిక ప్రకటన చేసిన నెట్ ఫ్లిక్స్.
- V Santhosh Kumar
- Published on- May 10, 2026 / 06:50 PM IST
Netflix Good News to Money Heist Series Fans
- మనీ హెయిస్ట్ కొత్త కథలు సిద్ధం.
- మే 15న బెర్లిన్ సీజన్-2 విడుదల.
- నెట్‌ఫ్లిక్స్‌లో అభిమానులకు భారీ వినోదం.
Money Heist: ప్రపంచవ్యాప్త ప్రభంజనం సృష్టించిన స్పానిష్ సిరీస్ ‘మనీ హెయిస్ట్(Money Heist)’ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఐదు సీజన్లతో ఈ సిరీస్ ముగిసినప్పటికీ, ‘వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్’ పేరుతో సరికొత్త కథలను తీసుకురాబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా స్పష్టం చేసింది. ప్రొఫెసర్ టీమ్ సాహసాలను మళ్ళీ వెండితెరపై చూడబోతున్నామనే వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ గ్లోబల్ హిట్ ఫ్రాంచైజీని మరింత విస్తరిస్తూ కొత్త ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Sreemukhi: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి.. తమ్ముడితో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోలు
మరోవైపు, ఈ సిరీస్ స్పిన్-ఆఫ్ ‘బెర్లిన్’ రెండో సీజన్ విడుదలకు సిద్ధమైంది. మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ క్రేజీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అసలు మనీ హెయిస్ట్ కథ ప్రారంభానికి ముందు బెర్లిన్ ముఠా చేసిన తెలివైన దోపిడీల నేపథ్యంలో ఈ సీజన్ సాగనుంది. ప్రొఫెసర్ మేధస్సు, బెర్లిన్ స్టైలిష్ యాక్షన్‌ను మిస్ అవుతున్న ప్రేక్షకులకు ఈ వేసవిలో నెట్‌ఫ్లిక్స్ డబుల్ ధమాకా వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే మరిన్ని అధికారిక అప్‌డేట్స్ రానున్నాయి.
The revolution isn’t over yet. The world of LA CASA DE PAPEL continues… pic.twitter.com/2nxNRrYlkw
— Netflix (@netflix) May 9, 2026
