Squid Game 2 : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ గేమ్ సిరీస్ స్క్విడ్ గేమ్.. సీజన్ 2 త్వరలో.. గ్లింప్స్ రిలీజ్..

2021లో కొరియన్‌లో వచ్చిన స్క్విడ్ గేమ్ నెట్‌ఫ్లిక్స్ స్థాయిని మార్చేసింది. తక్కువ బడ్జెట్ తో చిన్న సిరీస్‌లా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ అనూహ్యంగా ప్రపంచమంతటా భారీ విజయం సాధించింది.

Netflix Squid Game season 2 glimpse released series coming soon

Netflix : ప్రస్తుతం ఓటీటీ(OTT)లో సిరీస్ లు సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. టాప్ ఓటీటీలు అన్ని కూడా సిరీస్ లపై భారీ పెట్టుబడులు పెడుతున్నారు. వరల్డ్ టాప్ ఓటీటీల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్(Netflix) లో సిరీస్‌లకు కొదవ లేదు. ప్రపంచవ్యాప్తంగా పలు రకాల భాషల్లో రోజుకో కొత్త సిరీస్ వస్తూనే ఉంటుంది. 2021లో కొరియన్‌లో వచ్చిన స్క్విడ్ గేమ్ నెట్‌ఫ్లిక్స్ స్థాయిని మార్చేసింది. తక్కువ బడ్జెట్ తో చిన్న సిరీస్‌లా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ అనూహ్యంగా ప్రపంచమంతటా భారీ విజయం సాధించింది.

ఈ ఒక్క సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్ కి వందల కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ తో పటు, కొరియన్ సిరీస్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ సిరీస్‌లో నటించిన వాళ్లంతా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. మనం చిన్నప్పుడు ఆడుకునే ఓ గేమ్ కి శిక్షలు, బహుమతులు, డేంజర్ రూల్స్ పెట్టి, ఆట మధ్యలో ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని మెప్పించారు స్క్విడ్ గేమ్ యూనిట్. ఈ సిరీస్ హిట్ అయినప్పుడు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ఈ సిరీస్ సక్సెస్ తో నెట్‌ఫ్లిక్స్ కొన్ని వందల కోట్లు కొరియన్ కంటెంట్ పై పెట్టుబడి పెట్టింది.

Adipurush : నేపాల్ ఖాట్మండులో ఆదిపురుష్ బ్యాన్.. ఆదిపురుష్ దెబ్బకి ఇండియన్ సినిమాలన్నీ బ్యాన్..

తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 2కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి క్యారెక్టర్స్ ని రివీల్ చేశారు. అలాగే ఈ సిరీస్ నవంబర్ లో రాబోతుందని ప్రకటించారు. దీంతో స్క్విడ్ గేమ్ సిరీస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సిరీస్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు