×
Ad

Niharika Konidela : ఇంత లెంగ్త్ ఉన్నాడేంటి.. నిహారిక పక్కన ఉంది ఎవరంటే..!

నిహారిక కొణిదెల సస్పెన్స్‌తో కూడిన పిక్ షేర్ చెయ్యగా.. నెట్టింట వైరల్ అవుతోంది..

  • Published On : August 24, 2021 / 11:41 AM IST

Niharika Konidela

Niharika Konedila: ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. చిరు నటిస్తున్న మూడు కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఇక అదే రోజున రాఖీ పండుగ కూడా కావడంతో మెగా – అల్లు ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకుని తల్లి అంజనా దేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీజ, సుష్మిత కొణిదెల రాఖీ సెలబ్రేషన్స్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

తర్వాత రోజు నిహారికతో రాఖీ కట్టించుకోవడానికి చెల్లెలు ఆద్యతో కలిసి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు.. లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్. తమ్ముడికి రాఖీ కట్టిన నిహారిక, అకీరా ముఖం కనిపించకుండా అతని చాటున దాక్కుని.. ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను సస్పెన్స్‌లో పెట్టాలని చూసింది.

కట్ చేస్తే.. హైట్, ఫిజిక్ చూసి తను పవర్ స్టార్ కొడుకు లిటిల్ పవర్ స్టారేనని ఈజీగా కనిపెట్టేశారు. నిహారిక షేర్ చేసిన ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ ఇటీవల అకీరా కర్రసాము నేర్చుకుంటున్న వీడియో పోస్ట్ చేశారు. దాంతో అకీరా యాక్టింగ్‌తో పాటు పలు అంశాలకు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు వచ్చాయి.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్..!