Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకి లైన్ క్లియర్
సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి వస్తున్న సంగీత్ శోభన్- నయన్ సారిక 'రాకాస(Raakaasaa)' మూవీ.
- V Santhosh Kumar
- Published On : February 6, 2026 / 09:23 AM IST
Niharika Konidela Raakaasaa movie releasing in April.
- సంగీత్ శోభన్ హీరోగా రాకాస
- రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్
- సమ్మర్ లో భయపెట్టి, నవ్వించడానికి వస్తున్న రాకాస
Raakaasaa: టాలీవుడ్ యంగ్ హీరో, మ్యాడ్ మూవీ ఫేమ్ సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’. ఆయ్ మూవీ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకురాలు మానస శర్మ తెరకెక్కిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Vinay Ratnam: దయచేసి రివ్యూలు రాయండి.. డైరెక్టర్ వింత స్టేట్మెంట్.. ఇంతకీ ఏంటి సంగతి?
‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిహారిక నిర్మాణంలో వస్తున్న చిత్రం కావడంతో రాకాస సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో రాకాస(Raakaasaa) మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలోనే తాజాగా రాకాస సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2026, ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. మరి ఫాంటసీ, హార్రర్ అండ్ హిలేరియస్ కామెడీతో ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. ఇక రాకాస సినిమా విషయానికి వస్తే, సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
Niharika Konidela Raakaasaa movie releasing in April. (1)
