Niharika Konidela: యాక్టింగ్ కి గుడ్ బై చెప్తున్నారా?.. షాకింగ్ కామెంట్స్ చేసిన నిహారిక

తన యాక్టింగ్ కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela).

Niharika Konidela shocking comments on her acting career

  • ‘రాకాస’ ప్రమోషన్స్ లో నిహారిక సందడి
  • కెరీర్ ప్లాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
  • మంచి పాత్రలు వస్తే నటిగా కంటిన్యూ అవుతానంటూ క్లారిటీ

Niharika Konidela: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, లేటెస్ట్ బ్యూటీ నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను మానస శర్మ తెరకెక్కించగా మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చిత్రబృందం పాల్గొని రాకాస గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Siri Hanmanth: టెంప్టింగ్ లుక్స్‌తో సిరి హనుమంత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ పిక్స్

ఈ క్రమంలో నిహారిక తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక రిపోర్టర్ ఆమె నటనకు స్వస్తి చెప్పి, ఇకపై పూర్తిగా నిర్మాతగానే కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు నిహారిక స్పష్టతనిచ్చారు. తనకు నటన అంటే చాలా ఇష్టమని, దానిని వదలనని ఆమె పేర్కొన్నారు. నిర్మాతగా మంచి సినిమాలను నిర్మిస్తూనే, నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. నిర్మాతగా బాధ్యతలు పెరిగినప్పటికీ, నటిగా తన ప్రయాణం కొనసాగుతుందని వివరించారు.

‘రాకాస’ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో రాణిస్తూనే, తనలోని నటిని కూడా సంతృప్తిపరిచే కథల కోసం ఎదురుచూస్తున్నట్లు నిహారిక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో, నిహారిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న నిహారిక నటిగా ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చూడాలి.