Niharika : నన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు.. నేను చేసేది చేస్తూనే ఉంటా.. నిహారిక కామెంట్స్ వైరల్..

నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన రాకాస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. (Niharika)

  • Published On : March 31, 2026 / 07:25 AM IST

Niharika

Niharika : మెగా డాటర్ నిహారిక యాంకర్ గా టీవీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతుంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, సినిమాలు.. ఇలా నిర్మాతగా వరుస హిట్స్ కొడుతుంది. నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన రాకాస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.

ఈ ఈవెంట్లో నిహారిక మాట్లాడుతూ.. నేను కమిటీ కుర్రాళ్ళు సినిమా చేసినప్పుడు 15 మంది కొత్తవాళ్లను ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక మంచి సినిమా చేయొచ్చు కదా అందరికి తెలిసింది. యంగ్ కథలు ఏదైనా చేయొచ్చు కదా ఈ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎందుకు అన్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా చేస్తుంటే ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా ఎందుకు ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నావు అంటున్నారు. నేనేం ఏం చేసినా నన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నేను చేసేది చేస్తూనే ఉంటా అని తెలిపింది.

Also Read : Manchu Lakshmi : కూతురితో మంచు లక్ష్మి క్యూట్ ఫొటోలు.. ఓణీల వేడుకల్లో..

తన సక్సెస్ పై, తన వర్క్ పై చేసే కామెంట్స్ కి ఇలా సమాధానమిచ్చింది నిహారిక. దీంతో నిహారిక కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే నిహారిక ప్రతి స్క్రిప్ట్ ని జాగ్రత్తగా ఎంచుకొని తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మంచి సినిమాలు నిర్మిస్తుంది. ఆల్రెడీ యూట్యూబ్, ఓటీటీలలో హిట్స్ కొట్టిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు రాకాస సినిమాతో ఏప్రిల్ 3న రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత వరుణ్ తేజ్ తో బరి అనే సినిమా భారీగా తెరకెక్కిస్తోంది.