Karthikeya 2 : నేషనల్ అవార్డు సాధించిన కార్తికేయ 2 సినిమా.. ఉత్తమ తెలుగు చిత్రంగా..

తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు.

Nikhil Karthikeya 2 Movie Wins National Best Telugu Film Award in 70th National Film Awards

Karthikeya 2 : తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన కార్తికేయ 2 సినిమా అవార్డు గెలుచుకుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

ఇప్పుడు కార్తికేయ 2 సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుని ప్రకటించారు. ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులోని కృష్ణతత్వం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు