SPY Trailer : నిఖిల్ స్పై ట్రైలర్ రిలీజ్.. లాస్ట్‌లో టాలీవుడ్ హల్క్ ఎంట్రీ..
నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్పై’ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్..
- gum 95921
- Updated on- June 23, 2023 / 07:41 AM IST
Nikhil Siddharth Iswarya Menon SPY Movie trailer relased
SPY Trailer : స్టార్ హీరోలు ఒక పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే.. యంగ్ సెన్సేషన్ నిఖిల్ (Nikhil Siddharth) మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలను రెడీ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో నుంచి ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో ఈ సినిమా కథ.. సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు చుట్టూ సాగనుందని తెలియజేసి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.
Vyooham Teaser : ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం సెట్ చేసిన వర్మ..
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ AAA సినిమాస్ లో నిర్వహించారు. హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీం ఈ కార్యక్రమంలో పాల్గొనుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. విజువల్స్ విషయంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక సినిమాలో రానా దగ్గుబాటి ఒక గెస్ట్ రోల్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ ఎండ్ లో రానా.. “స్వతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు లాకునేది. ఇది నేను చెప్పింది కాదు నేతాజీ చెప్పింది” అన్న డైలాగ్ అదిరిపోయింది.
క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గ్యారీ బిహెచ్’ డైరెక్ట్ ఈ సినిమాని చేస్తున్నాడు. నిఖిల్ తో కలిసి స్టంట్స్ చేయడానికి తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) రంగంలోకి దిగింది. శ్రీచరణ్ పకల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించిన నిఖిల్ ఈ సినిమాతో ఎటువంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
