Karthikeya 3 : ‘కార్తికేయ 3’ పక్కా ఉంది.. అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే కొత్త అడ్వెంచర్..

కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించడంతో కార్తికేయ 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.

Karthikeya 3 : ‘కార్తికేయ 3’ పక్కా ఉంది.. అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే కొత్త అడ్వెంచర్..

Nikhil Siddhartha gives update on Karthikeya 3 Movie

Karthikeya 3 : నిఖిల్(Nikhil Siddhartha) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ కి మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సీక్వెల్ ప్రకటించి 2022లో కార్తికేయ 2 సినిమాతో వచ్చారు. ఈ సారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కృష్ణుడి కాన్సెప్ట్ ని తీసుకొని కార్తికేయ 2ని తెరకెక్కించగా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించింది.

కార్తికేయ 2 సినిమా ఏకంగా 120 కోట్ల కలెక్షన్స్ సాధించి నిఖిల్ కెరీర్ లోనే భారీ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. దీంతో కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించడంతో కార్తికేయ 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు. తాజాగా నిఖిల్ అధికారికంగా తన సోషల్ మీడియాలో దీని గురించి ట్వీట్ చేసాడు. డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్ ని వెతుకుతున్నాడు. త్వరలో కార్తికేయ 3 అని ట్వీట్ చేసాడు నిఖిల్. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Kalki 2898AD : ఏపీ ఎన్నికలతో ప్రభాస్ ‘కల్కి’ వాయిదా? మరోసారి ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?

చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక కార్తికేయ 3 మొదలుపెట్టనున్నాడు. త్వరలోనే కార్తికేయ 3 నుంచి అధికారిక పోస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఈ సారి ఇంకెంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్ లాంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 3 సినిమా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఎప్పుడు ఉంటుంది ఈ సినిమా అని ప్రశ్నిస్తున్నారు.