Kalki 2898AD : ఏపీ ఎన్నికలతో ప్రభాస్ ‘కల్కి’ వాయిదా? మరోసారి ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?

ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు.

Kalki 2898AD : ఏపీ ఎన్నికలతో ప్రభాస్ ‘కల్కి’ వాయిదా? మరోసారి ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?

Prabhas Kalki 2898AD Movie Postponed again due to Elections

Kalki 2898AD : బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్(Prabhas) కి మళ్ళీ పడలేదు. ఇటీవల సలార్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. సలార్ తర్వాత త్వరలో మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా గురించి పలు మార్లు మాట్లాడి అంచనాలు బాగా పెంచారు.

అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా కల్కి 2898AD సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా క్యాన్సిల్ అయి వాయిదా పడేలా ఉంది. త్వరలో దేశమంతా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. నిన్నే ఎన్నికల డేట్స్ ప్రకటించగా ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : Pawan Kalyan : పవన్ OG అప్డేట్ కూడా రాబోతోందా? బాలీవుడ్ హీరో హింట్.. ఆ డేట్ కి..?

ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు. సగం మంది పార్టీల ప్రమోషన్స్ లో పాల్గొంటారు. కొంతమంది ఎన్నికల అరేంజ్మెంట్స్ బిజీలో ఉంటారు. అలాంటి టైంలో థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేంత టైం ఎవ్వరూ ఇవ్వరు. అంతే కాకుండా ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ కి – ఎన్నికల డేట్ కి కేవలం నాలుగు రోజులే గ్యాప్ ఉంది. దీంతో ఆ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ కూడా వర్కౌట్ అవ్వవు. సినిమా టికెట్ రేట్లు పెంచే అవకాశం కూడా లేదు. దేశమంతా ఎన్నికల సీజన్ కాబట్టి పాన్ ఇండియా కూడా వర్కౌట్ అవ్వదు. దీంతో ఇలాంటి టైంలో కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవు. అందుకే కల్కి సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. కచ్చితంగా ప్రభాస్ కల్కి సినిమా వాయిదా పడి ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడ్డాకే కల్కి సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది.