Swayambhu: నిఖిల్ ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అంతా ఓటీటీ చేతిలోనే.. ఎప్పుడంటే అప్పుడే!

నిఖిల్ ‘స్వయంభూ(Swayambhu)' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

Nikhil siddhartha swayambhu movie release date update

  • ఎట్టకేలకు నిఖిల్ స్వయంభు విడుదలపై క్లారిటీ
  • సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్
  • ఫైనల్ చేయనున్న ఓటీటీ సంస్థ

Swayambhu: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు(Swayambhu)’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్లుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Allu Arjun: నేను మీ సినిమాలో చేస్తాను.. అల్లు అర్జున్ కు బాలీవుడ్ స్టార్ రిక్వెస్ట్.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్

ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నాభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, దీని ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 (ZEE5) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండటంతో, ఓటీటీ సంస్థ ప్రతినిధులు ఫైనల్ అవుట్‌పుట్‌ను చూసి, ఆ తర్వాతే రిలీజ్ డేట్‌ను లాక్ చేయనున్నారని సమాచారం.

భారీ యుద్ధ సన్నివేశాలు, చారిత్రక నేపథ్యం ఉన్నందున విజువల్ గ్రాఫిక్స్‌పై చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడంతో, ఈ ‘స్వయంభూ’ చిత్రాన్ని కూడా ఐదు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఏప్రిల్ 17న అయినా ఈ సినిమా వస్తుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.