Alias Rukmini : నితిన్ అలియాస్ రుక్మిణి నుంచి ‘రుక్కు రుక్కు రుక్మిణి..’ సాంగ్ వచ్చేసింది..
మీరు కూడా ఈ రుక్కు రుక్కు రుక్మిణి పాట వినేయండి.. (Alias Rukmini)
- Saketh U
- Published on- October 27, 2026 / 05:27 PM IST
Alias Rukmini
Alias Rukmini : నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా తెరకెక్కుతున్న సినిమా అలియాస్ రుక్మిణి. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మాణంలో మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరో, హీరోయిన్స్ పాత్రల గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ ఒక స్కూల్ లో టీచర్స్ అని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి రుక్కు రుక్కు రుక్మిణి అనే పాటని విడుదల చేసారు. ఈ పాటని విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో పూర్ణాచారి రాయగా అనురాగ్ కులకర్ణి పాడారు. మొయిన్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.
Also Read : Prabhas : ప్రభాస్ తో గురూజీ సినిమా.. త్రివిక్రమ్ ఏమన్నాడంటే.. అసలు అది అయ్యే పనేనా..?
మీరు కూడా ఈ రుక్కు రుక్కు రుక్మిణి పాట వినేయండి..
