Nithiin : వరుస ఫ్లాప్స్ వచ్చినా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టిన నితిన్..

ఇపుడు వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్. (Nithiin)

  • Published On : March 31, 2026 / 10:12 AM IST

Nithiin

Nithiin : నితిన్ కష్టపడుతున్నా వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. నితిన్ లాస్ట్ నాలుగు సినిమాలు ఫ్లాప్. గత సినిమా తమ్ముడు బాగా కష్టపడినా, సినిమా బాగున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. తమ్ముడు కూడా ఫలపు అవ్వడంతో నితిన్ నెక్స్ట్ సినిమాలపై అనేక రూమర్స్ వచ్చాయి. వేణు ఎల్లమ్మ సినిమా వదులుకున్నాడు. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సినిమా కూడా వదులుకున్నాడు అని టాక్. ఇలా హిట్ దర్శకుల సినిమాలు వదులుకున్నాడు నితిన్ ఇంకేం సినిమాలు చేస్తాడు అని అందర్లోనూ చర్చ నెలకొంది.

కానీ ఇపుడు వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్. కంబ్యాక్‌ కోసం ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో వస్తున్నాడు వస్తోన్న నితిన్. దాదాపుగా 9 నెలల వరకూ ఖాళీగానే ఉండి ఈ గ్యాప్‌లో స్టోరీ సెలక్షన్‌పై ఫోకస్‌ పెట్టిన నితిన్‌ ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Also See : Rama Prabha : సీనియర్ నటి రమాప్రభ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఫొటోలు వైరల్..

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నితిన్ హీరోగా ప్రొడక్షన్‌ నెంబర్‌ 43 ప్రాజెక్ట్‌కి సంబంధించి నితిన్ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్‌ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే సితార బ్యానర్‌లో భీష్మ, రంగ్‌దే సినిమాలు చేశారు నితిన్. ఈ రెండు మంచి హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. సితారలో నితిన్ హైట్రిక్ కొట్టాలని అనుకుంటున్నారు.

అలాగే నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై మరో సినిమాకి రెడీ అవుతున్నారు. ఆయ్‌ సినిమా డైరెక్టర్‌ అంజి కే మణిపుత్ర చెప్పిన పాయింట్‌ నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట నితిన్‌. జులై నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్‌ అప్‌డేట్‌ రావాలి.

Also See : Anchor Sravanthi : తెలుపు డ్రెస్‌లో హంసలా మెరుస్తున్న యాంకర్ స్రవంతి..

ఈ రెండు సినిమాలతో పాటు వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో ఇంట్రస్టింగ్‌ ప్రాజక్ట్‌కి రెడీ అయ్యారు నితిన్‌. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి నో బడీ నో రూల్స్‌ అంటూ ఇటీవల మేకర్స్ విడుదల చేసిన నితిన్‌ ప్రీలుక్‌ పోస్టర్‌ అందరి అటెన్షన్‌ గ్రాబ్‌ చేసింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి కంబ్యాక్‌ కోసం మూడు ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌ లైనప్‌ చేసిన నితిన్‌ ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటారో చూడాలి.