Robinhood : నితిన్ దొంగతనం చేసేది అప్పుడే.. ‘రాబిన్ హుడ్’ రిలీజ్ డేట్ అనౌన్స్..
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది మూవీ యూనిట్.
- Saketh U
- Published on- April 17, 2024 / 01:25 PM IST
Nithiin Rabinhood Movie Releasing Date Announced
Robinhood : నితిన్(Nithiin) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘రాబిన్ హుడ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదట ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా ప్రకటించినా ఆమె తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ని ఎవర్ని తీసుకున్నారు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఆల్రెడీ రాబిన్ హుడ్ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని అంతా భావిస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది మూవీ యూనిట్. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 20 శుక్రవారం నుంచి క్రిస్మస్ 25 వరకు ఆరు రోజులు ఈ సినిమాకి కలిసొస్తుంది.
ప్రస్తుతానికి డిసెంబర్ లో ఇంకా ఏ భారీ సినిమాలు ప్రకటించలేదు. అప్పటివరకు ఏం వస్తాయో తెలీదు. ఏ పెద్ద సినిమాలు లేకపోతే నితిన్ రాబిన్ హుడ్ కి కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశం ఉంది. నితిన్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి రాబిన్ హుడ్ హిట్ అవ్వడం నితిన్ కి చాలా అవసరం.
