×
Ad

Yellamma: పాపం.. నితిన్ బాధ వర్ణనాతీతం.. అసలు ‘ఎల్లమ్మ’ సినిమా ఎలా మిస్ అయ్యింది!

దర్శకుడు బలగం వేణుతో ఎల్లమ్మ(Yellamma) సినిమాను మిస్ చేసుకున్న హీరో నితిన్.

Nithin is the first choice for venu yeldandi Yellamma movie

  • ఎల్లమ్మ సినిమాకు ముందు హీరో నితిన్
  • అనివార్య కారణాల వల్ల చెయ్ జారిన బెస్ట్ ప్రాజెక్టు
  • నితిన్ ప్లేస్ లో దేవి శ్రీ ప్రసాద్ కి అవకాశం

Yellamma: కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరుగవు. మన కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ, ఏం చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే హీరో నితిన్ కి ఎదురయ్యింది. పాపం, ప్రస్తుతం అయన బాధ వర్ణించడం చాలా కష్టం. ఇంతకీ ఆ బాధ దేని గురించి అనుకుంటున్నారా. ‘ఎల్లమ్మ(Yellamma)’ సినిమా గురించి. ఎందుకంటే, ఎల్లమ్మ సినిమాకు ముందుగా అనుకున్న హీరో నితీన్ కాబట్టి. అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నితిన్.

నిజానికి రెండేళ్ల క్రితమే ఎల్లమ్మ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా సంక్రాంతి కానుకగా ఎల్లమ్మ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సంస్కృతిలో భాగమైం ఎల్లమ్మ ఒగ్గు కథలు, డప్పుల మోతలు లాంటి రూరల్ కంటెంట్ తో వచ్చిన ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అయితే, ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ దక్కించుకున్నాడు. ఈ ఒక్క గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Pragya Jaiswal: షార్ట్ స్కర్ట్ లో హాట్ లుక్స్.. ప్రగ్యా స్టన్నింగ్ పిక్స్ వైరల్.. ఫొటోలు

పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను భారీగా తెరకెక్కించనున్నారు దర్శకుడు వేణు ఎల్దండి. ఇక ఈ గ్లింప్స్ విడుదల అయినప్పటి నుంచి నెటిజన్స్ హీరో నితిన్ పై జాలి చూపిస్తున్నారు. బ్యాడ్ లక్ నితిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక తెలంగాణ హీరోగా ఎల్లమ్మ సినిమాలో నితిన్ చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ ఇక బాగా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం అతని ప్రీవియస్ సినిమాలే.

భీష్మ సినిమా తరువాత నితిన్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. కనీసం యావరేజ్ కూడా ఆడలేదు. దీంతో, ఆ ప్లాప్ ల ఎఫెక్ట్ ఎల్లమ్మ సినిమాపై పడకుండా ఉండాలని మేకర్స్ నితిన్ ని ఈ సినిమా నుంచి తప్పించారట. దీంతో, గ్లింప్స్ చూశాక అసలు నితిన్ నిద్రపోయి ఉంటాడా అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి నితిన్ తన కెరీర్ లో గుర్తిండిపోయే పాత్రను మిస్ అయ్యాడు అనే చెప్పాలి. చూడాలి మరి ఆ పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడు అని.