Evaru Meelo Koteeswarulu : స్పెషల్ డే.. ఫస్ట్ ఎపిసోడ్..
చెర్రీ, తారక్‌ల మధ్య ఆసక్తికరంగా జరిగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఇరు హీరోల అభిమానులతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకోనుందట..
- sekhar
- Published On : August 12, 2021 / 04:10 PM IST
Ntr Ram Charan
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం.. దర్శకధీరుడు రాజమౌళి తారక్‌ని కొమరం భీం, చరణ్‌ని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది.
RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..
‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి రావడానికంటే ముందే తారక్, చరణ్ కలిసి ప్రేక్షకాభిమానులను సర్‌ప్రైజ్ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో త్వరలో టెలికాస్ట్ కానుంది. ఆగస్టు నెలలోనే ప్రసారం కానుందని తెలియజేస్తూ వదిలిన ప్రోమోస్ షో మీద అంచనాలు పెంచేశాయి.
అయితే చరణ్ గెస్ట్‌గా పాల్గొనబోయే ఫస్ట్ ఎపిసోడ్‌ను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న టెలికాస్ట్ చెయ్యనున్నారట. చెర్రీ, తారక్‌ల మధ్య ఆసక్తికరంగా జరిగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఇరు హీరోల అభిమానులతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షో నిర్వాహకులు చెప్పారు. ఇక టిఆర్పీ రేటింగ్ పరంగానూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రికార్డ్ క్రియేట్ చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో టెలికాస్ట్ వివరాలతో కూడిన ప్రోమో రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
Evaru MeeloKoteeswarulu : ‘మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’..
