×
Ad

Ntr: సింహాద్రి లెవల్ ఎలివేషన్.. బెంగళూర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. నయా లుక్ అదిరిపోయిందిగా

డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్(Ntr) కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

NTR came Bangalore for hospital opening

  • బెంగళూర్ వచ్చిన ఎన్టీఆర్
  • భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్
  • నెట్టింట ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ కొత్త లుక్

Ntr: ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక సినిమా సెండ్ హాఫ్ సింహాద్రి హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసి జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. అది కూడా మళ్ళీ ఎన్టీఆర్ కోసమే.

కానీ, అది కేరళలో కాదు బెంగుళూరులో. మార్చి 8న ఎన్టీఆర్ బెంగళూర్ లో ప్రముఖ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు, ఎన్టీఆర్(Ntr) అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ అన్నా.. ఎన్టీఆర్ అన్నా.. అంటూ ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెనుక పరిగెత్తుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సవాహాన్ని గమనించిన ఎన్టీఆర్ వాహనం నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం చేశారు.

Funky OTT: ఓటీటీలో విశ్వక్ ‘ఫంకీ’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆ కొన్ని క్షణాలు ఎన్టీఆర్ ను చూసిన ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి, చాలా కాలంగా ఎన్టీఆర్ బయటకు రావడం లేదు. తన నెక్స్ట్ సినిమా కోసం స్పెషల్ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే, చాలా కాలంగా కెమెరాకు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు ఎన్టీఆర్.

ఆ కారణంగానే, ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలియడంతో భారీగా జనం అక్కడకు చేరుకున్నారు. ఇక నయా లుక్ లో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాడు. గుబురు గెడ్డంతో, షార్ట్ హెయిర్ స్టైల్ తో స్టయిలీష్ గ మారిపోయాడు ఎన్టీఆర్. ఈ లుక్ అదిరిపోయింది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.