Devara – Thandel : ఎన్టీఆర్‌కి పోటీగా నాగచైతన్య.. దేవర వెర్సస్ తండేల్..
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దసరాకి దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది.
- gum 95921
- Published On : February 17, 2024 / 08:46 PM IST
NTR Devara Naga Chaitanya Thandel movie releases updates
Devara – Thandel : ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కే సినిమాలు అన్ని భారీ బడ్జెట్‌తో, క్రేజీ కాంబినేషన్స్‌తో ప్రెస్టీజియస్ గానే రూపొందుతున్నాయి. దీంతో క్వాలిటీ కోసం చిత్రీకరణ విషయంలో కొంచెం లేటు అవుతుంది. అయితే ఈ ఆలస్యం రిలీజ్ సమయంలో ఇబ్బంది పెడుతుంది. ఒక డేట్ నుంచి పోస్టుపోన్ అయిన మూవీ.. మరో సినిమాకి అడ్డంకిగా మారుతుంది. ఇక ఈ అడ్డంకి కాస్త బాక్స్ ఆఫీస్ పోటీగా మారి కలెక్షన్స్ తగ్గుతున్నాయి.
తాజాగా ఇలాంటి సమస్యే ఎన్టీఆర్, నాగచైతన్య సినిమాకి కూడా ఎదురయ్యేలా కనిపిస్తుంది. తారక్ అండ్ చైతన్య.. తమ కెరీర్స్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా చేస్తున్న చిత్రాలు ‘దేవర’, ‘తండేల్’. ఈ సినిమాలు కోసం ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ ‘దేవర’.. ఏప్రిల్ నెలలోనే రావాల్సి ఉంది. కానీ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఈ పోస్టుపోన్‌తో నెక్స్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడానికి దేవర టీం బాగా కష్టపడింది.
Also read : Allu Arjun : తగ్గేదేలే అంటున్న పుష్ప.. ఇంటర్నేషనల్ మీడియాతో అల్లు అర్జున్..
మే నెలలో ప్రభాస్ ‘కల్కి’, ఆగష్టులో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఉండడంతో.. రిలీజ్ ని దసరా పండక్కి ప్లాన్ చేయాల్సి వచ్చింది. దేవర 1ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా నాగచైతన్య కూడా అదే సమయంలో రావడానికి సిద్దమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘తండేల్’.. దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట.
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు సముద్రం బ్యాక్‌డ్రాప్ తోనే వస్తున్నాయి. మరి తండేల్, దేవరతో పోటీకి దిగుతుందా..? లేదా వెనక్కి తగ్గుతుందా..? అనేది చూడాలి.
