Ntr: ట్విన్స్ కి జన్మనిచ్చిన ఉపాసన.. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్
రామ్ చరణ్- ఉపాసన దంపతలకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్(Ntr).
- V Santhosh Kumar
- Published On : February 1, 2026 / 11:57 AM IST
NTR extended his best wishes to Ram Charan and Upasana.
- కవలలకు జన్మనిచ్చిన ఉపాసన కొణిదెల
- పాప, బాబు రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు
- సోషల్ మీడియాలో విష్ చేసిన ఎన్టీఆర్
Ntr: రామ్ చరణ్- ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసింది. జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఒకరు పాప, ఒకరు బాబు అవడం విశేషం. ఇక వారసుడి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా ఫ్యాన్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్ దంపతులకు విషెష్ చెప్తున్నారు.
Ram Charan- Upasana: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగాస్టార్ ఇంట మెగా సంబరాలు
ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్(Ntr) రామ్ చరణ్- ఉపాసనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “కవల పిల్లలకు జన్మనిచ్చినందుకు రామ్ చరణ్- ఉపాసనలకు నా శుభాకాంక్షలు. మీకు ప్రేమ, ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను”అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Congratulations to @AlwaysRamCharan and @upasanakonidela on their twins. ❤️ Wishing the family love, health and happiness.
— Jr NTR (@tarak9999) February 1, 2026
