NTR
NTR : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రస్తుతం డ్రాగన్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ షూటింగ్ మాత్రం నిదానంగా సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో మధ్యలో వాయిదాలు పడింది. తాజాగా మరోసారి ఈ సినిమా షూటింగ్ కి ఇబ్బంది రావడంతో ఆపేశారట.(NTR)
ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ జోర్డాన్ దేశంలో జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది. మార్చ్ 6 వరకు ఈ సినిమా షూటింగ్ జరగాలి. అనుకున్నట్టు యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేశారట కానీ ఈ సీక్వెన్స్ లకు సంబంధించిన కొన్ని కనెక్టింగ్ సీన్స్ లో అడ్డంకులు వచ్చాయట. జోర్డాన్ లో స్థానికంగా సరైన జూనియర్ ఆర్టిస్టులు లేకపోవడం, లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతానికి షూటింగ్ ఆపేశారట.
Also Read : Toxic : టాక్సిక్ ఈవెంట్.. దిల్ రాజు బిగ్ ప్లాన్
తిరిగి మూవీ యూనిట్ రిటన్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చాక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి మిగిలిన సీన్స్ ని షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారట. దీంతో మరోసారి ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. గతంలో స్క్రిప్ట్ సమస్యలు వచ్చి, మరోసారి ఎన్టీఆర్ కి గాయాలు అయి, మరోసారి వేరే సమస్యలతో ఇలా పలుమార్లు ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ ఆగిపోతూ వస్తుంది.
ఈ సంవత్సరం జూన్ 25న డ్రాగన్ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి చెప్పినట్టు ఆ సమయానికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ వాయిదా వేస్తారా చూడాలి.
Also Read : Jai Hanuman: హనుమాన్ జన్మస్థలంలో మొదలైన “జై హనుమాన్” మూవీ.. అంజనాద్రిలో ప్రత్యేక పూజలు