NTR Neel Glimpse: రెడీగా ఉండండి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్.. అర్ధరాత్రి ఎన్ని గంటలకు? ఎక్కడ?

NTR Neel Glimpse: తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు అని ప్రకటించారు. (NTR Neel)

  • Updated on- May 18, 2026 / 03:02 PM IST

NTR Prasanth Neel Dragon Glimpse Release Date Time Announced

NTR Neel: ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. అధికారికంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించకపోయినా డ్రాగన్ అనే పేరు వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి లీక్ ఫొటోలు తప్ప అధికారికంగా ఎన్టీఆర్ పోస్టర్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. సినిమా షూటింగ్ ఏమో వాయిదాలు పడుతూ వస్తుంది.

కానీ ఈ సినిమాపై, ఎన్టీఆర్ లుక్స్ చూసి భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఇంకా సంవత్సరం ఆగాలా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తామని అధికారికంగానే ప్రకటించారు.

Also Read : Divyabharathi : అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తున్న దివ్యభారతి.. ఫొటోలు..

తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ ని మే 19 అర్ధరాత్రి 11 గంటల 52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే 20.5937° N, 78.9629° E లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ని ప్రకటించారు.

గూగుల్ మ్యాప్స్ లో 20.5937° N, 78.9629° E దీన్ని వెతికితే ఇండియాలో జియోగ్రాఫికల్ గా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ చూపిస్తుంది.మహారాష్ట్రలోని వాద్రా అనే ఓ ఊరికి దగ్గర్లో ఈ లోకేషన్ చూపిస్తుంది. అక్కడ ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారేమో అని సమాచారం. ఇక టీమ్ ఇచ్చే ఎలివేషన్స్ తో ఈ గ్లింప్స్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టిన రోజుకి భారీగానే ప్లాన్ చేయబోతున్నారు.

Also Read : Sobhita Dhulipala : సూట్‌లో స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో శోభిత ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు..