×
Ad

NtrNeel: ప్రశాంత్ ని మార్చేసిన ఎన్టీఆర్.. డ్రాగన్ విషయంలో ఆ అనుమానాలే వద్దు

డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్(NtrNeel) ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఖాయం.

NTR, Prashanth Neel Dragon movie going to be colorful.

NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తన హీరోలకు ఇచ్చే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఎలివేషన్స్ గనక ఎన్టీఆర్ కి పడితే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. అందుకే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్(NtrNeel) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, డ్రాగన్ సినిమా విషయంలో అందరికీ ఒక అనుమానం ఉండేది. అదేంటంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఒక సమస్య ఉంది.

Kayadu Lohar: ఫంకీ బ్యూటీ కాయదు.. గోల్డ్ చీరలో మీరిపోతుందిగా.. ఫొటోలు

అదేంటంటే, ఆయన సినిమాలన్నీ బ్లాక్ థీమ్ తో ఉంటాయి. ఆయన మొదటి సినిమా ఉగ్రం నుంచి మొన్నటి సలార్ వరకు అన్ని సినిమాలు నలుపు రంగులోనే ఉంటాయి. హీరో వేసుకొనే కాస్టూమ్స్ కూడా నల్లగానే ఉంటాయి. ఇప్పుడు డ్రాగన్ కూడా అదే తరహాలో ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ, డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ తన శైలీని మార్చుకున్నాడట.

ఈ సినిమా మొత్తం చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో డాన్సులు, డ్యూయెట్ సాంగ్స్ ఉండవు. కానీ, డ్రాగన్ సినిమాలో అవి కూడా ఉండనున్నాయట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విషయంలోను డిజప్పాయింట్ అవ్వకూడదు అని ఈ డెసిషన్ తీసుకున్నాడట ప్రశాంత్ నీల్. అయితే, ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ఇన్ పుట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. కాబట్టి, డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉండబోతుంది అని క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి, డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నమాట.