Devara – NTR : ‘దేవర’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. భారీ అప్డేట్..

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Devara – NTR : ‘దేవర’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. భారీ అప్డేట్..

NTR Shares a Special Photo from Devara Movie Shooting Sets

Devara – NTR : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత దేవర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దేవర షూటింగ్ సెట్ లో ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్న ఫొటో షేర్ చేసి.. ఇప్పుడే దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. ఇది చాలా అద్భుతమైన జర్నీ. సముద్రపు ప్రేమను, మూవీ టీమ్ ని మిస్ అవుతాను. శివ చేతిలో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాని సెప్టెంబర్ 27న చూడటానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసారు.

Also Read : Vikram Dance : ఇదేందయ్యా.. గుంటూరు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్సులతో రచ్చ చేసిన విక్రమ్.. వీడియో వైరల్..

దీంతో ఎన్టీఆర్ స్వయంగా దేవర సినిమా పూర్తయింది అని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూట్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ త్వరగా ముగించి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో దిగనున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)