Vikram Dance : ఇదేందయ్యా.. గుంటూరు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్సులతో రచ్చ చేసిన విక్రమ్.. వీడియో వైరల్..

తంగలాన్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు.

Vikram Dance : ఇదేందయ్యా.. గుంటూరు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్సులతో రచ్చ చేసిన విక్రమ్.. వీడియో వైరల్..

Vikram Dance With College Students in Thangalaan Movie Promotions Videos goes Viral

Updated On : August 13, 2024 / 9:49 PM IST

Vikram Dance : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఇప్పుడు తంగలాన్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రాప్ లో ట్రైబల్, బంగారు గనులు స్టోరీతో తంగలాన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త గెటప్ లతో మెప్పించే విక్రమ్ ఈ సినిమా కోసం కూడా బాగా కష్టపడ్డాడు.

అయితే తంగలాన్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ముఖ్యంగా తంగలాన్ టీమ్ తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేసి తెలుగు సినిమాలాగే అన్ని ఊర్లు తిరుగుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరులో ప్రమోషన్స్ చేసారు. విక్రమ్ స్వయంగా వచ్చి ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు.

Also Read : Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రిలీజ్.. నాని శివ తాండవం..

తాజాగా నేడు గుంటూరు VVIT కాలేజీలో విక్రమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి స్టేజిపై విక్రమ్ డ్యాన్సులు వేస్తూ రచ్చ చేసారు. దీంతో విక్రమ్ డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. అసలు ఒక స్టార్ హీరో ఈ రేంజ్ లో అలా స్టూడెంట్స్ తో డ్యాన్స్ వేయడం ఏంటి, ఒక తమిళ సినిమాకి తెలుగులో ఈ రేంజ్ ప్రమోషన్స్ చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి తంగలాన్ తెలుగు మార్కెట్ మీద గట్టిగానే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ తంగలాన్ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.