Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రిలీజ్.. నాని శివ తాండవం..

తాజాగా నాని సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేసారు.

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రిలీజ్.. నాని శివ తాండవం..

Nani Priyanak Mohan Saripodhaa Sanivaaram Movie Trailer Released

Updated On : August 13, 2024 / 8:41 PM IST

Saripodhaa Sanivaaram Trailer : బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాని, ప్రియాంక మోహన్ జంటగా SJ సూర్య విలన్ గా తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ప్రమోషన్స్ లో ముందు నుంచి చెప్పినట్టే శనివారం ఒక్కరోజే హీరో తన కోపాన్ని చూపిస్తాడు. తన కోపం చూపించాలని ఎవరి పేరు అయినా తన డైరీలో రాసుకుంటే వాళ్ళ అంతు చూడకుండా వదిలిపెట్టడు. సోకుల పాలెం అనే ఊర్లో జనాలని పోలీసులు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి సమస్యలోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు. హీరో విలన్ లాంటి పోలీసుని, మిగతా మనుషులని ఎలా ఎదుర్కున్నాడు అని సినిమా ఆసక్తిగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ లోనే మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. దీంతో సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. వివేక్ ఆత్రేయ ఈసారి నానిలోని మాస్ ని మరోసారి కొత్తగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.