NTR : గాయం నుంచి ఇంకా కోలుకొని ఎన్టీఆర్..? కానీ మలయాళ హీరో కోసం రంగంలోకి..?
తారక్ ఒక్కసారి బయటకు వస్తే చూడాలనే ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది. (NTR)
- Saketh U
- Published on- September 27, 2026 / 07:41 AM IST
NTR
NTR : కొన్ని నెలలుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్స్‌కి దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడి భుజానికి ఆపరేషన్ జరిగి రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్. అయితే అభిమానులు మాత్రం తారక్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. పూర్తిగా గాయం నుంచి రికవర్ అయ్యాకే డ్రాగన్ షూటింగ్‌లో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా రికవర్ అవ్వలేదని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని టాక్. అయితే తారక్ ఒక్కసారి బయటకు వస్తే చూడాలనే ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది.
ఇప్పుడు అభిమానుల కోరిక నెరవేరబోతోంది తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానుల అటెన్షన్‌కి ఫహద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్‌గా అవుతోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తెలుగులో నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తుండటం, అతని తనయుడు కార్తికేయ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడంతో ఆసక్తి నెలకొంది సినిమాపై. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో జరిగే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యేందుకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
Also Read : Chiranjeevi : హైట్ ఎక్కువ అని మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్..?
దీంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ని చూడటానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కి రాజమౌళితో పాటు ఆయన తనయుడు కార్తికేయ కూడా చాలా క్లోజ్ అని అందరికి తెలిసిందే. RRR సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేదో చెప్పుకొచ్చారు. దీంతో కార్తికేయ నిర్మించిన సినిమా కాబట్టి ఎన్టీఆర్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది.
అలాగే ఈవెంట్లో డ్రాగన్ కొత్త షెడ్యూల్‌కి సంబంధించి అప్‌డేట్ ఏమైనా ఇస్తారా అని కూడా వెయిట్ చేస్తున్నారు. డ్రాగన్ సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్ అక్టోబర్ నుంచే మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ సైతం షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అయ్యారని ఇండస్ట్రీలో టాక్. ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ గాయం కారణంగా డిస్ట్రబ్ అయిన షూట్ షెడ్యూల్స్ అన్నింటిని మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు. వన్స్ తారక్ సెట్స్‌లో అడుగుపెడితే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో డ్రాగగ్ షూటింగ్ పూర్తి చేసి చెప్పిన డేట్ కి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో ఉన్నారు.
Also See : Jyothika Munirathnam : ‘గుండెనిండా గుడిగంటలు’ నటి.. సీరియల్ లో పద్దతిగా.. బయట బోల్డ్ గా.. ఫొటోలు..
