Hi Nanna: స్టైలిష్‌గా నాని, హాట్ లుక్‌లో శ్రుతిహాస‌న్.. అదిరిపోయిన ‘ఓడియమ్మా’ పాట‌

Odiyamma Lyrical from Hi Nanna : హాయ్ నాన్న చిత్రం నుంచి ఓడియమ్మా అనే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Odiyamma Lyrical from Hi Nanna

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న‌’. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తండ్రీ, కూతురు ల మ‌ధ్య సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ‘ఓడియమ్మా’ అనే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. నాని, శ్రుతి హాసన్‌లపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

Bigg Boss 7 Telugu : రేస్ టూ ఫినాలే ప్ర‌క్రియ మొద‌లు.. పాపం శోభాశెట్టి.. ప్రియాంక మాత్రం..

అనంత శ్రీరామ్ ఈ పాట‌ను రాయ‌గా హేశమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేశారు. త‌మిళ స్టార్ న‌టుడు విక్రమ్‌ కొడుకు, యాక్టర్‌ ధ్రువ్‌ విక్రమ్‌, చిన్మయి శ్రీపాద, శృతిహాసన్ లు ఈ పాట‌ను పాడారు. స్టైలిష్ లుక్‌లో నాని క‌నిపించ‌గా, హాట్ లుక్‌లో శ్రుతిహాస‌న్ మ‌తి పోగొట్టింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల లు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

ట్రెండింగ్ వార్తలు